stand
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, నామవాచకం, నిలుచుట, నిలవబడుట, ఉండుట.
- the ground on which the trees stand ఆ చెట్లు వుండే నేల.
- this will stand you in good stead యిది నీకు సహాయమవును, అనుకూలమవును.
- he standswell with the governor వీడియందు గౌనరు వారి దయ నిండా వున్నది.
- he stands as plaintiff వాడు వాదిగా వున్నాడు.
- he stands charged with theft వాడి మీద దొంగతనము వచ్చినది.
- they stood back వెనకకువొదిగినారు.
- if you will stand by me I will do this తమ అండ వుంటే నేను దీన్ని చేస్తాను, తమ ఆదరువు వుంటే దీన్ని చేస్తాను.
- they use that Dictionary as a stand by వాండ్లకు ఆ నిఘంటువే ఆధారము.
- he is thier great stand by అతడే వాండ్లకు ఆధారము, పట్టుకొమ్మ.
- they stood forward ముందరికి వచ్చినారు, సహాయము గా వచ్చినారు.
- this house standsby itself అది వొంటి ఇల్లు గా వున్నది.
- stand down sir! పోరా, అవతల పోరా.
- that pole stood erect గడ నిలవబెట్టి వుండినది.
- E. I. C. stands for East India Company ఇ. ఐ. సి. అంటే ఈష్టిండ్య కంపినీ అనిఅర్ధము.
- in this sentence he stands for Rama and she stands for Sitha యీ వాక్యములో వాడు అనగా రాముడు, ఆమె అనగా సీత.
- త|| stands for తర్వాత,తావేశి రెండు గీట్లు గీస్తే తర్వాత అని అర్ధము.
- this will stand for a longtime యిది శానా దినాలకు వుండును.
- they stand in awe of him వాడి భయము వీండ్లకు వున్నది.
- the stands in need of food and clothing వాడికి అన్న వస్త్రము లు లేకుండా వున్నవి.
- the ship stood on and off ఆ వాడ కొంచెములో సముద్రము తట్టుగానున్ను కొంచెము రేవు తట్టు గానున్ను పోతూ వస్తూ వుండినది.
- his hair stood on end వాడి వొళ్ళు జలపరించినది.
- the ship stood out to sea వాడలో సముద్రానికి పోయినది.
- they stood out of the way తొలగినారు.
- this account must stand over యీ లెక్కను నిలిపి పెట్టవలసినది.
- if you have taken the house it stands to reason that you must pay for it ఆ ఇంటిని నీవు కొనుక్కొనివుంటే దానికినీవు రూకలు చెల్లించవలసినది న్యాయమే.
- the water stood still నీళ్ళు కదలకుండా వుండినది.
- he stood up for his wifes relationఆలివంక వాండ్లకై పోరాడినాడు, యెదురాడినాడు.
- he stands upon trifles కొంచానికి పట్టుకొని పోరాడుతాడు.
- he stands in need of punishmentవాడికి శిక్ష కావలెను.
- the help you stand in need of నీకు కావలసి వుండే సహాయము.
క్రియ, విశేషణం, to endure తాళుట, వోర్చుట, భరించుట.
- he stood the raillery very well వాండ్లు చేసిన యెగతాళిని నిండాగా సహించుకొనియుండినాడు.
- I will not stand this behaviour యీ నడత నాకు సరిపడదు.
- this book will not stand examination యీ పుస్తకము పరీక్షకు నిలవదు.
- this business will not stand trial యీ పని విచారణలోకి వస్తే తొందరవచ్చును.
- this house will not stand a storm యీ యిల్లు గాలివానకు నిలవదు.
- do you think your father will stand this? దీనికి మీ తండ్రి వూరికె తాళుకొని వుండునా.
- will you stand the loss? ఆ నష్టాన్ని పడుతావా.
- you will stand the blame ఆ తప్పు నీకు వచ్చును.
- if he becomes bail he willstand the consequences వాడు పూటబడితే దానికి వచ్చేగతిని వాడు అనుభవిస్తాడు.
- will you stand security for him? వాడికి పూటబడుతావా.
- this horse will stand fire యీ గుర్రము తుపాకి వేట్లకు భయపడదు.
- they stood witness వాండ్లుసాక్షులుగా వుండినారు.
నామవాచకం, s, నిలిచేస్థానము.
- a table with one leg వొంటికాలు మేజ.
- a frame or table on which vessels are placed గడమంచె.
- a stand for pots యింగ్లీషువారు కుండలను వొకటి మీద వొకటిగా పెట్టేచట్టము.
- a stand for flowers or flower stand పుష్పములు పెట్టే పాత్ర.
- an ink stand యింకీ బుడ్డి.
- he is at a stand మానై నిలిచిపోయినాడు.
- when I read this I was at a stand దీన్ని చదివియెటూ తోచక వుండినాను.
- he came to a stand నిలిచిపోయినాడు, యేమిన్ని చేయలేకపోయినాడు.
- the work came to a stand ఆ పని నిలిచిపోయినది.
- the troops retreated to the wood where they made a stand ఆ దండు తిప్పుకొని ఆ యడవికివచ్చి అక్కడనే నిలిచి వుండినది.
- he took his stand at the end of the street వీధి కొనను అట్టే నిలుచుండి వుండినాడు.
- 250 stand of arms యీన్నూట యాభైమందికి కావలసిన ఆయుదములు.
- four stand of colours నాలుగుజండాలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).