[go: up one dir, main page]

Jump to content

want

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to be without, to need కొరతగా వుండుట, లేక వుండుట, అక్కరవుండుట, ఆశించుట, కోరుట.

  • I want it అది నాకు కావలెను.
  • I do not want that అది నాకు అక్కరలేదు, వద్దు.
  • I do not want water నాకు నీళ్ళతో పనిలేదు.
  • I do not want him to sit here వాడు యిక్కడ కూర్చుండ వలెనని నాకు అక్కరలేదు.
  • come here I want you యిందా నీతో పనివున్నది, యిక్కడికిరా, పనివున్నది.
  • he wants manners వానివద్ద మర్యాదలేదు.
  • what do you want ? నీ కేమి కావలెను, నీ వేమి పనికి వచ్చినావు.
  • he wants you వాడు నిన్ను పిలుస్తాడు,రమ్మంటాడు.
  • what I want is a light నాకు కావలసినది దీపము.
  • the horse wants an ear ఆ గుర్రానికి వౌక చెవి తక్కువ.
  • this house wants width యీ యింటికి వెడల్పు తక్కువ.
  • this beam wants length యీ దూలమునకు నిడువు చాలదు.
  • she wants the use of her two handsఆపెకు రెండు చేతులూ స్వాధీనము లేదు.
  • begin this work and you shall not want aid యీ పనిని ఆరంభించు, నీకు కావలసిన సహాయము నేను చేస్తాణు.
  • he wants several of his teeth వానికి కొన్ని పండ్లు పోయినవి.
  • this spear wants a head యీ బల్లెము మొణపోయినది.
  • the carriage wants a wheel యీ బండికి వొక చక్రము లేదు.
  • he wants nothing వానికి యేమిన్ని తక్కువలేదు.
  • It wants an hour of noon మధ్యాహ్నము కావడానకు యింకా గంట తక్కువ వున్నది.
  • rich men never want flatterersభాగ్యవంతులకు పొగిడేవాండ్లు తక్కువా.
  • the unhappy never want enemies? దౌర్భాగ్యులకు శత్రువులు లేక వుండరు.
  • I want to go to Nellore నెల్లూరికి పోవలెనని వున్నాను, నాకు నెల్లూరికి పోవలసి వున్నది.
  • the book that is wanted కావలసి వుండే పుస్తకము you have been wanting to yourself in this business యీ పనిలో నీవు అశ్రద్ధచేసినావు.

నామవాచకం, s, need; necessity, deficiency; defect అక్కర, అగత్యము,లేమి, తక్కువ, కొదవ, లోపము, వెలితి.

  • poverty దారిద్య్రము.
  • he supplied all my wants నాకు కావలసినదంతా జాగ్రత్త చేసినాడు.
  • want of courage అధైర్యము.
  • want of temper ఆతురము.
  • want of appetite or digestion అజీర్ణము.
  • want strength బలహీనము.
  • want of energy పాలుమాలిలక.
  • a man in want బిదవాడు, పేదవాడు.
  • he is not in want వాడు బిదవాడు కాదు.
  • want of money దారిద్య్రము.
  • want of sense అవివేకము.
  • want of knowledge అజ్ఞానము.
  • want of judgement తెలివి లేమి, అవివేకము.
  • he is in want of money to do this దీన్ని చేయడానకు వానికి రూకలు లేదు.
  • I am in want of a guide నాకు దారి చూపేవాడు కావలెను.
  • being in want of money రూకలు కావలసి.
  • for want of sleep నిద్రలేనందున, చాలనందున.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=want&oldid=949417" నుండి వెలికితీశారు