[go: up one dir, main page]

Jump to content

అమ్మ

వికీవ్యాఖ్య నుండి
అమ్మ

సృష్టికి మూలం అమ్మ . అమ్మలేనిదే జీవితం లేదు. అన్నిచోట్ల దేవుడు ఉండలేక అమ్మను సృష్టించాడు .

Comments on Amma

[మార్చు]
  • The mother of the tree of life. Hghug

సినిమా పాటల్లో అమ్మ

[మార్చు]
  • అమ్మ వంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే --ఆత్రేయ
  • పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా --చంద్రబోస్‌
  • అమ్మను మించి దైవమున్నదా... ఆత్మను మించి అర్థమున్నదా... --సినారె
  • అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే... అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే...
  • ధీరులకు దీనులకు అమ్మ ఒడి ఒక్కటే... --సిరివెన్నెల

కవితల్లో అమ్మ

[మార్చు]
  • తల్లి యొకతే సాకు తనయు లంబదిమంది-ఉంగలోన ప్రేమ రంగరించి/ తల్లి యొకతే బరువు తనయులెందరికైన...--నార్ల వెంకటేశ్వరరావు
  • పోగులుగా విడిపోతున్న స్మృతి ముద్రను మనసు చట్రంలో పొదుగుకొని/ అమ్మ రూపం నిలుపుకుంటాను/ జన్మమూలం పదిల పరుచుకుంటాను.--సి.నారాయణరెడ్డి

అమ్మపై ఉన్న సామెతలు

[మార్చు]
  • అడగందే అమ్మ అయినా పెట్టదు
  • అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు
  • కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే
  • ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె
  • తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది.
  • తల్లి పుట్టిల్లు మేనమామ కెరుకే
  • కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే
  • అమ్మ కడుపు చూస్తుంది.... ఆలి జేబు చూస్తుంది.


w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.

==తల్లి== వ్యాఖ్యలు

  • తన తల్లిని లాగే బాలుడ్ని కూడ ఎవరు అపార్థం చేసుకోము. ..... నార్నన్ డగ్లాస్
  • తన పిల్లల్ని గురించి తల్లి గొప్ప భవిష్యత్తుని కలలు కంటుంది. ....హెచ్.టి.హెన్రీ
  • తల్లి అర్థం చేసుకున్నట్లు తండ్రి అర్థం చేసుకోడు .............అస్కార్ వైల్డ్
  • ప్రేమించే స్త్రీ లాంటి బానిస లేదు. ప్రేమిస్తే ఎవరిలోనూ తల్లలాంటి బానిస లేదు....బీచర్
  • తల్లిని తండ్రి గౌరవించు. ....................... బైబిల్
  • తల్లిని మించిన దైవము లేదు ................తెలుగు నానుడి
  • తల్లి కొడుకు కడుపును చూస్తుంది.... భార్య జేబులు చూస్తుంది .....తెలుగులో ఒక సామెత
  • పిల్లవాడికి తల్లి ఎంతటి మనిషికంటే దైవంకంటే ఎక్కువ --- ఇప్పటికి... ఎప్పటికి. హడ్సన్
  • తల్లి ఆహారంకంటే ప్రేమను కోరుకుంటుంది............ఎర్మినియో
  • తల్లి ఎంత వయసులో వున్నా మధ్యవయస్సున్న కొడుకుని కూడ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటుంది. స్కాట్ మాక్సవెల్
  • దేవుడు ప్రతిచోట వుండలేడు. అందుకే తల్లిని సృష్టించాడు.. జ్యూయిష్ సామెత
  • చిన్నపిల్లల హృదయములోపెదాల్లో తల్లే దేవుడు....థాకరే
  • తల్లి నిజమైన తల్లే; అయితే ఎప్పటికీ స్వేచ్చాజీవికాదు..............బాల్జాక్
  • తల్లిలేని ఇల్లేనా? తల్లి అభిమానం మాటల్లో వర్ణించలేము.......ఎమర్సన్
  • మనిషి తన తల్లి ఎలా తయారుచేస్తే అలా తయారవుతాడు.......ఎమర్సన్
  • ప్రతి స్త్రీ తన తల్లిలాగే మారుతుంది. అది వారి విషాదం. పురుషుడు అలా కాదు. అది అతని స్వంతం.ఆస్కార్ వైల్డ్
  • తల్లి అనేది అలౌకిక వక్తీకరణ. మానవ జాతికే పరిమితం కాదు...... డికిన్ సన్
  • నేను నాఆశలు నేను దేవత లాంటి తల్లికి ఋణపడి వుంటాను. ....అబ్రహాం లింకన్
  • తల్లే ప్రథమ గురువు......................తెలుగు నానుడి

మూస:మూలం. సూక్తి సింధు

"https://te.wikiquote.org/w/index.php?title=అమ్మ&oldid=23208" నుండి వెలికితీశారు