గ్రూప్ 11 మూలకం
ఆవర్తన పట్టికలో గ్రూప్ 11 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
↓ Period | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
4 | Copper (Cu) 29 Transition metal | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
5 | Silver (Ag) 47 Transition metal | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
6 | Gold (Au) 79 Transition metal | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
7 | Roentgenium (Rg) 111 unknown chemical properties | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Legend
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఆధునిక IUPAC నంబరింగ్ ప్రకారం గ్రూప్ 11, [1] ఆవర్తన పట్టికలోని రసాయన మూలకాల గ్రూప్. ఇందులో రాగి (Cu), వెండి (Ag), బంగారం (Au) ఉంటాయి. Roentgenium (Rg) ను కూడా ఈ గ్రూపు లోనే ఉంచారు. అయితే బంగారంతో పోలిస్తే ఇది భారీ హోమోలాగ్‌గా ప్రవర్తిస్తుందని నిర్ధారించే రసాయన ప్రయోగాలు ఇంకా జరగలేదు. గ్రూప్ 11 మూలకాలను నాణేలను ముద్రించడంలో ఉపయోగించడం వలన ఈ గ్రూపును నాణేల లోహాలు అని కూడా పిలుస్తారు. [2] లోహపు ధరల పెరుగుదల కారణంగా వెండి, బంగారాలను కరెన్సీని చెలామణి చేయడానికి ఉపయోగించడం లేదు. ఆభరణాలలో మాత్రమే వీటిని వాడతారు. ఈ రోజు వరకు నాణేలలో ఉన్న లోహం రాగి మాత్రమే. ఈ మూడూ బహుశా మానవుడూ కనుగొన్న మొదటి మూడు మూలకాలు. రాగి, వెండి, బంగారం అన్నీ ప్రాకృతికంగా మూలక రూపంలో లభిస్తాయి . [3] [4]
లక్షణాలు
[మార్చు]ఇతర గ్రూపుల మాదిరిగానే, ఈ కుటుంబం లోని మూలకాలు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్‌లో, ప్రత్యేకించి బయటి షెల్‌లలో, ఒక ధోరణిని చూపుతాయి. తద్వారా రసాయన ప్రవర్తనలో పోకడలు ఏర్పడతాయి. అయితే రోంట్జెనియం దీనికి బహుశా మినహాయింపు:
Z | మూలకం | ఎలక్ట్రాన్లు/షెల్ సంఖ్య |
---|---|---|
29 | రాగి | 2, 8, 18, 1 |
47 | వెండి | 2, 8, 18, 18, 1 |
79 | బంగారం | 2, 8, 18, 32, 18, 1 |
111 | రోంట్జెనియం | 2, 8, 18, 32, 32, 17, 2 (అంచనా) |
గ్రూపు 11 మూలకాలన్నీ సాపేక్షంగా జడమైనవి. ఇవి తుప్పు నిరోధక లోహాలు. రాగి, బంగారానికి రంగు ఉంది, కానీ వెండికి రంగు లేదు. రోంట్జెనియం వెండి లాగా ఉంటుందని అంచనా వేసారు. అయితే దీనిని నిర్ధారించడానికి తగినంత పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయలేదు.
ఈ మూలకాల విద్యుత్ నిరోధకత తక్కువ కాబట్టి వాటిని వైరింగ్ కోసం ఉపయోగిస్తారు. రాగి చౌకైనది కావడాన, దాన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లలో వాడే బాండ్ వైర్లు సాధారణంగా బంగారం వాడతారు. వెండి, వెండి పూతతో కూడిన రాగి వైరింగును కొన్ని ప్రత్యేక అనువర్తనాల్లో వాడతారు.
లభ్యత
[మార్చు]చిలీ, చైనా, మెక్సికో, రష్యా, అమెరికాల్లో రాగి మూలక రూపంలో లభిస్తుంది. రాగి యొక్క వివిధ సహజ ఖనిజాలు: కాపర్ పైరైట్స్ (CuFeS2), కుప్రైట్ లేదా రూబీ కాపర్ (Cu2O), రాగి గ్లాన్స్ (Cu2S), మాలకైట్, (Cu (OH)2CuCO3), అజురైట్ (Cu (OH)2 2CuCO3).
కాపర్ పైరైట్ ప్రధానమైన ఖనిజం. ప్రపంచ రాగి ఉత్పత్తిలో దాదాపు 76% దీని నుండే వస్తుంది.
ఉత్పత్తి
[మార్చు]వెండి స్థానిక రూపంలో, బంగారం (ఎలక్ట్రమ్)తో మిశ్రమంగాను, సల్ఫర్, ఆర్సెనిక్, యాంటీమోనీ లేదా క్లోరిన్ కలిగిన ఖనిజాలలోనూ లభిస్తుంది. ఖనిజాలలో అర్జెంటైట్ (Ag2S), క్లోరార్‌గైరైట్ (AgCl) ముఖ్యమైనవి. క్లోరార్‌గైరైట్లో కొమ్ము వెండి, పైరార్‌గైరైట్ (Ag3SbS3) ఉంటాయి. పార్క్స్ ప్రక్రియను ఉపయోగించి వెండిని సంగ్రహిస్తారు.
ఉపయోగాలు
[మార్చు]ఈ లోహాలకు, ముఖ్యంగా వెండికి, వాటి ద్రవ్య లేదా అలంకారాలకు కాకుండా పారిశ్రామిక అనువర్తనాలకు అవసరమైన అసాధారణ లక్షణాలు ఉన్నాయి. అవన్నీ అద్భుతమైన విద్యుత్ వాహకాలు. లోహాలన్నిటి లోకీ అత్యంత విద్యుద్వాహకాలు వెండి, రాగి, బంగారం. వెండి అత్యంత ఉష్ణ వాహక మూలకం కూడా. అది కాంతిని అత్యధికంగా ప్రతిబింబించే మూలకం కూడా. వెండికి ఉన్న ఒక అసాధారణమైన లక్షణం ఏంటంటే, దానిపై ఏర్పడే మసక కూడా అధిక విద్యుత్ వాహకతను కలిగి ఉంటుంది.
ఎలక్ట్రికల్ వైరింగు, సర్క్యూట్లలో రాగిని విస్తృతంగా ఉపయోగిస్తారు. తుప్పు పట్టకుండా ఉండగల బంగారపు లక్షణానికి గాను దాన్ని కొన్ని పరికరాలలో ఉపయోగిస్తారు. వెండిని చాలా కీలకమైన అప్లికేషన్‌లలో ఎలక్ట్రికల్ కాంటాక్ట్‌లుగా విస్తృతంగా ఉపయోగిస్తారు. వెండి నైట్రేట్ కాంతికి గురికావడంతో లోహంలోకి మారుతుంది కాబట్టి దాన్ని ఫోటోగ్రఫీలో కూడా ఉపయోగిస్తారు. దీన్ని వ్యవసాయం, వైద్యం, ఆడియోఫైల్, శాస్త్రీయ అనువర్తనాల్లో కూడా వాడతారు.
బంగారం, వెండి, రాగి చాలా మృదువైన లోహాలు. నాణేలుగా రోజువారీ ఉపయోగంలో సులభంగా దెబ్బతింటాయి. విలువైన లోహం కూడా వాడుకలో సులభంగా అరిగి పోవచ్చు. నాణేల పనితీరులో ఈ లోహాలు నాణేలు ఎక్కువ మన్నికను పొందేందుకు గాను వీటిని ఇతర లోహాలతో కలిపాలి. ఇతర లోహాలతో కలపడం వల్ల ఏర్పడే నాణేలు దృఢపడి, వైకల్యం చెందే అవకాశం తక్కువగా ఉంటుంది. అరుగుదలకు ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటాయి.
బంగారు నాణేలు: బంగారు నాణేలు సాధారణంగా 90% బంగారం, లేదా 22 క్యారెట్ (91.66%) బంగారం, మిగిలిన భాగం రాగి, వెండితో ఉత్పత్తి చేస్తారు. బులియన్ బంగారు నాణేలు 99.999% బంగారంతో ఉత్పత్తి అవుతాయి.
వెండి నాణేలు: వెండి నాణేలు సాధారణంగా 90% వెండితో ఉత్పత్తి అవుతాయి. మిగతా భాగం రాగి ఉంటుంది. పాత యూరోపియన్ నాణేలు సాధారణంగా 83.5% వెండితో ఉత్పత్తి చేయబడ్డాయి. ఆధునిక వెండి బులియన్ నాణేలు తరచుగా 99.9% నుండి 99.999% వరకు స్వచ్ఛతతో ఉత్పత్తి చేయబడతాయి.
రాగి నాణేలు: రాగి నాణేల స్వచ్ఛత చాలా ఎక్కువగా, దాదాపు 97%, ఉంటుంది. సాధారణంగా చిన్న మొత్తంలో జింక్, టిన్ లను కలుపుతారు.
ద్రవ్యోల్బణం కారణంగా నాణేల ముఖ విలువ వాటికి ఉపయోగించిన లోహాల హార్డ్ కరెన్సీ విలువ కంటే దిగువకు పడిపోయింది. అందుచేత ఆధునిక నాణేలను, రాగి, నికెల్ వంటి క్షార లోహాలతో తయారు చేయడం మొదలైంది. నికెల్- ఇత్తడి (రాగి (75), నికెల్ (5), జింక్ (20)), మాంగనీస్ -ఇత్తడి (రాగి, జింక్, మాంగనీస్, నికెల్), కాంస్య వంటివి వాడతారు.
జీవ పాత్ర, విషం
[మార్చు]అధిక మొత్తంలో రాగి విషపూరితమైనప్పటికీ, జీవితానికి చాలా అవసరం . రాగిలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఆసుపత్రి తలుపు హ్యాండిళ్ళకు రాగిని వాడతారు. రాగి పాత్రలలో ఆహారాన్ని తినడం వల్ల రాగి విషప్రభావాన్ని పెంచుతుంది.
బంగారం, వెండి మూలకాలకు ఎటువంటి విషపూరిత ప్రభావాలు లేదా జీవసంబంధమైన ఉపయోగం లేదు. అయితే, బంగారు లవణాలు కాలేయం, మూత్రపిండాల కణజాలానికి విషపూరితం కావచ్చు. [5] [6] రాగి వలె, వెండికి కూడా యాంటీమైక్రోబయల్ లక్షణాలున్నాయి. బంగారం లేదా వెండితో కూడిన పాత్రలను సుదీర్ఘంగా ఉపయోగించడం వల్ల శరీర కణజాలంలో ఈ లోహాలు పేరుకుపోతాయి; ఫలితంగా క్రిసియాసిస్, ఆర్గిరియా అని పిలవబడే తిరుగులేని కానీ స్పష్టంగా హానిచేయని పిగ్మెంటేషన్ పరిస్థితులు ఏర్పడతాయి
స్వల్పజీవిత కాలం, రేడియోధార్మికత కారణంగా, రోంట్జెనియంకు జీవసంబంధమైన ఉపయోగమేమీ లేదు. కానీ రేడియోధార్మికత కారణంగా ఇది చాలా హానికరం.
మూలాలు
[మార్చు]- ↑ . "New Notations in the Periodic Table".
- ↑ "23.6: Group 11: Copper, Silver, and Gold". Chemistry LibreTexts (in ఇంగ్లీష్). 2015-01-18. Retrieved 2022-03-25.
- ↑ "These Are the Native Elements That Occur in Nature". ThoughtCo (in ఇంగ్లీష్). Retrieved 2022-03-25.
- ↑ "List Native Elements Minerals & Naturally Occurring Metals In Pure Form". Mineral Processing & Metallurgy (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-09-27. Retrieved 2022-03-25.
- ↑ . "Acute poisoning with gold cyanide".
- ↑ . "Cholestatic Hepatitis Caused by Acute Gold Potassium Cyanide Poisoning".