లూపస్
లూపస్ | |
---|---|
ఇతర పేర్లు | సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసస్ |
యువతిలో లూపస్ వలన కనిపించే సీతాకోకచిలుక దద్దుర్లు | |
ప్రత్యేకత | రుమాటాలజీ |
లక్షణాలు | కీళ్లలో బాధాకరమైన వాపు, జ్వరం, ఛాతీ నొప్పి, జుట్టు రాలడం, నోటి పూత, శోషరస కణుపుల వాపు, అలసటగా అనిపించడం, ముఖంపై ఎర్రటి దద్దుర్లు |
సాధారణ ప్రారంభం | 15-45 సంవత్సరాల మధ్య |
కాల వ్యవధి | దీర్ఘ కాలం |
కారణాలు | కారణాలు తెలియరాలేదు. పర్యావరణ,జన్యు పరమైన అంశాలు |
రోగనిర్ధారణ పద్ధతి | లక్షణాలు, రక్త పరీక్షలు |
చికిత్స | సరిపడినంత నిద్ర, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం |
ఔషధం | స్టెరాయిడ్స్ కాని నొప్పి నివారణ మందులు (Nonsteroidal anti-inflammatory drug - NSAIDలు), కార్టికోస్టెరాయిడ్స్, రోగనిరోధక శక్తి అణిచే మందులు (ఇమ్యునోసప్రెసెంట్స్), హైడ్రాక్సీక్లోరోక్విన్, మెథోట్రెక్సేట్ |
రోగ నిరూపణ | సాధారణ జీవిత కాలం |
తరుచుదనము | 80% కి 15 సంవత్సరాలు |
లూపస్ ను సాంకేతికంగా సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసస్ ( SLE ) అని పిలుస్తారు, ఇది స్వయం ప్రతిరక్షక వ్యాధి (ఆటో ఇమ్యూన్ వ్యాధి). అంటే శరీర రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని అనేక భాగాలలో ఆరోగ్యకరమైన కణజాలంపై పొరపాటున దాడి చేస్తుంది. వ్యక్తులలో ఈ లక్షణాలు మారుతూ ఉంటాయి.
లక్షణాలు
[మార్చు]ఈ లక్షణాలు తేలికపాటి నుండి తీవ్రంగా ఉండవచ్చు. సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు - కీళ్లలో బాధాకరమైన వాపు , జ్వరం, ఛాతీ నొప్పి, జుట్టు రాలడం, నోటి పూత, శోషరస కణుపుల వాపు, అలసటగా అనిపించడం, ముఖంపై ఎర్రటి దద్దుర్లు ఉంటాయి. ఈ అనారోగ్యం ఏర్పడే కొన్ని సమయాలు ఉంటాయి వాటిని ( ఫ్లేర్స్) మంటలు అని పిలుస్తారు. అయితే కొన్ని లక్షణాలు మాత్రమే ఉండి ఉపశమనం కలిగే సమయాలు (రెమిషన్) ఉంటాయి.[1]
కారణాలు
[మార్చు]ఈ వ్యాధి ఎందుకు వస్తుందనే కారణం స్పష్టంగా లేదు. [1] ఇది పర్యావరణ కారకాలతో పాటు జన్యు పరమైన అంశాలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు. [2] ఏక రూపు కవలలలో, ఒకరు ప్రభావితమైతే, మరొకరికి కూడా 24% వచ్చే అవకాశం ఉంటుంది. [1] స్త్రీలింగ హార్మోన్లు, సూర్యకాంతి, ధూమపానం, విటమిన్ డి లోపం, కొన్ని సంక్రమణాలు కూడా ప్రమాదాన్ని పెంచుతాయని భావిస్తారు. [2] దీంట్లో విషయమేమంటే (మెకానిజం) ఒక వ్యక్తి స్వంత కణజాలాలకు ఈ ఆటోఆంటిబాడీస్ రోగనిరోధక ప్రతిస్పందనను కలుగ చేస్తుంది. ఇవి సాధారణంగా యాంటీ-న్యూక్లియర్ యాంటీబాడీస్, అవి వాపుకు కారణమవుతాయి. [1]
రోగనిర్ధారణ
[మార్చు]రోగ నిర్ధారణ కష్టం, అయితే లక్షణాలు ప్రయోగశాల పరీక్షల కలిపి రోగ నిర్ధారణ ఉంటుంది. లూపస్ ఎరిథెమాటోసస్ లో అనేక ఇతర రకాల ఉన్నాయి. [1] ఉదాహరణకి -
- డిస్కోయిడ్ లూపస్ ఎరిథెమాటోసస్,
- నియోనాటల్ లూపస్,
- సబాక్యూట్ క్యుటేనియస్ లూపస్ ఎరిథెమాటోసస్
చికిత్స
[మార్చు]వైద్యం లేదు. చికిత్సలలో స్టెరాయిడ్స్ కాని నొప్పి నివారణ మందులు (Nonsteroidal anti-inflammatory drug - NSAIDలు), కార్టికోస్టెరాయిడ్స్, రోగనిరోధక శక్తి అణిచే మందులు (ఇమ్యునోసప్రెసెంట్స్), హైడ్రాక్సీక్లోరోక్విన్, మెథోట్రెక్సేట్ ఉండవచ్చు.[1] కార్టికోస్టెరాయిడ్స్ తో చికిత్స వేగంగా ప్రభావవంతంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక వినియోగం దుష్ప్రభావాలకు దారితీస్తుంది.[3] ప్రత్యామ్నాయ ఔషధం వ్యాధిని ప్రభావితం చేయదని తెలుస్తోంది.[1] లూపస్ ఉన్నవారిలో ఆయుర్దాయం తక్కువగా ఉంటుంది. [4] ఇది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది, అందుకని మరణాలకి సాధారణ కారణం.[2] ఆధునిక చికిత్సకు సానుకూలంగా ప్రభావితమైన వారిలో 80% మంది 15 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవిస్తారు. [5] లూపస్‌తో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలకు ఎక్కువ ప్రమాదం ఉంటుంది. అయితే చాలా వరకు విజయవంతమవుతారు.[1]
వ్యాప్తి
[మార్చు]లూపస్ రేటు దేశాన్ని అనుసరించి మారుతుంటుంది. 100,000కి 20 నుండి 70 వరకు ఉంటుంది.[6] ప్రసవం వయస్సులో ఉన్న స్త్రీలు, పురుషుల కంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా ప్రభావితమవుతారు.[2] ఇది సాధారణంగా 15 - 45 సంవత్సరాల మధ్య ప్రారంభమైనప్పటికీ, ఏ వయసువారైనా ప్రభావితం కావచ్చు.[1] ఆఫ్రికన్, కరేబియన్, చైనీస్ జాతులకు చెందిన వారు శ్వేతజాతీయుల కంటే ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. [2][6] అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యాధి రేట్లు అస్పష్టంగా ఉన్నాయి. [7] లూపస్ అంటే లాటిన్‌లో "తోడేలు": దద్దుర్లు తోడేలు కాటులా కనిపిస్తాయని భావించినందున ఈ వ్యాధికి 13వ శతాబ్దంలో పేరు పెట్టారు. [8]
ప్రస్తావనలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "Handout on Health: Systemic Lupus Erythematosus". www.niams.nih.gov. February 2015. Archived from the original on 17 June 2016. Retrieved 12 June 2016.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 Lisnevskaia, L; Murphy, G; Isenberg, D (22 November 2014). "Systemic lupus erythematosus". Lancet. 384 (9957): 1878–88. CiteSeerX 10.1.1.1008.5428. doi:10.1016/s0140-6736(14)60128-8. PMID 24881804.
- ↑ Davis, Laurie S.; Reimold, Andreas M. (April 2017). "Research and therapeutics—traditional and emerging therapies in systemic lupus erythematosus". Rheumatology. 56 (suppl_1): i100–i113. doi:10.1093/rheumatology/kew417. PMC 5850311. PMID 28375452.
- ↑ Murphy, G; Isenberg, D (December 2013). "Effect of gender on clinical presentation in systemic lupus erythematosus". Rheumatology (Oxford, England). 52 (12): 2108–15. doi:10.1093/rheumatology/ket160. PMID 23641038.
- ↑ The Cleveland Clinic Intensive Review of Internal Medicine (5 ed.). Lippincott Williams & Wilkins. 2012. p. 969. ISBN 9781451153309. Archived from the original on 7 January 2020. Retrieved 13 June 2016.
- ↑ 6.0 6.1 Danchenko, N.; Satia, J.A.; Anthony, M.S. (2006). "Epidemiology of systemic lupus erythematosus: a comparison of worldwide disease burden". Lupus. 15 (5): 308–318. doi:10.1191/0961203306lu2305xx. PMID 16761508.
- ↑ Tiffin, N; Adeyemo, A; Okpechi, I (7 January 2013). "A diverse array of genetic factors contribute to the pathogenesis of systemic lupus erythematosus". Orphanet Journal of Rare Diseases. 8: 2. doi:10.1186/1750-1172-8-2. PMC 3551738. PMID 23289717.
{{cite journal}}
: CS1 maint: unflagged free DOI (link) - ↑ Chabner, Davi-Ellen (2013). The Language of Medicine. Elsevier Health Sciences. p. 610. ISBN 978-1455728466. Archived from the original on 2020-01-07. Retrieved 2020-08-04.