పల్మనరీ ఫైబ్రోసిస్
పల్మనరీ ఫైబ్రోసిస్ | |
---|---|
ఇతర పేర్లు | మధ్యంతర ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ |
వైద్య ఇమేజింగ్, ఊపిరితిత్తుల కణజాల పరీక్ష (బయాప్సీ) ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలు, ఛాతీ ఎక్స్ కిరణాల పటం | |
ప్రత్యేకత | శ్వాసకోస వ్యాధులు |
లక్షణాలు | శ్వాస ఆడకపోవడం, పొడి దగ్గు, అలసట, బరువు తగ్గడం, గోరు కొట్టుకుపోవడం |
సంక్లిష్టతలు | పల్మనరీ హైపర్ టెన్షన్, శ్వాస వైఫల్యం, న్యుమోథొరాక్స్, ఊపిరితిత్తుల క్యాన్సర్ |
కారణాలు | పర్యావరణ కాలుష్యం, కొన్ని రకాల మందులు, బంధన కణజాల వ్యాధులు, అంటువ్యాధులు, మధ్యంతర ఊపిరితిత్తుల వ్యాధులు |
ప్రమాద కారకములు | పల్మనరీ హైపర్ టెన్షన్, శ్వాస వైఫల్యం, న్యుమోథొరాక్స్, ఊపిరితిత్తుల క్యాన్సర్ |
రోగనిర్ధారణ పద్ధతి | లక్షణాలు, వైద్య ఇమేజింగ్, ఊపిరితిత్తుల కణజాల పరీక్ష (బయాప్సీ) ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలు |
చికిత్స | ఆక్సిజన్ చికిత్స, ఊపిరితిత్తుల పునరావాసం, ఊపిరితిత్తుల మార్పిడి |
ఔషధం | పిర్ఫెనిడోన్, నింటెడానిబ్ |
తరుచుదనము | 5 మిలియన్ల మంది ప్రజలు |
మరణాలు | ఆయుఃప్రమాణం సాధారణంగా ఐదు సంవత్సరాల లోపే |
పల్మనరీ ఫైబ్రోసిస్ అనేది రోగి ఊపిరితిత్తులు కాలక్రమేణా మచ్చలు (స్కార్స్) అయ్యే పరిస్థితి. శ్వాస ఆడకపోవడం, పొడి దగ్గు, అలసట, బరువు తగ్గడం, గోరు కొట్టుకుపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.[1] పల్మనరీ హైపర్ టెన్షన్, శ్వాస వైఫల్యం, న్యుమోథొరాక్స్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడవచ్చు.[2]
కారణాలు
[మార్చు]ఈ పరిస్థితికి కారణాలు పర్యావరణ కాలుష్యం, కొన్ని రకాల మందులు, బంధన కణజాల వ్యాధులు, అంటువ్యాధులు, మధ్యంతర ఊపిరితిత్తుల వ్యాధులు వంటివి. చాలా సాధారణంగా ఏది తెలియని కారణం వల్ల ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ (ఐ.పి.ఎఫ్) అనే మధ్యంతర ఊపిరితిత్తుల వ్యాధి ఏర్పడుతుంది. [1][3] రోగనిర్ధారణ సాధారణంగా లక్షణాలు, ఎక్స్ కిరణాల పటం, వైద్య ఇమేజింగ్, ఊపిరితిత్తుల కణజాల పరీక్ష (బయాప్సీ), ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలు ఆధారంగా ఉండవచ్చు.[1]
సాధారణంగా దీనికి చికిత్స లేదు . చికిత్స అనేది రోగ లక్షణాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఆక్సిజన్ చికిత్స, ఊపిరితిత్తుల పునరావాసం ఉండవచ్చు.[1][4] మచ్చలు మరింత తీవ్రతరం కావడాన్ని తగ్గించడానికి కొన్ని మందులను ఉపయోగించవచ్చు.[4] ఊపిరితిత్తుల మార్పిడి అప్పుడప్పుడు ఎంపిక సాధ్యం కావచ్చు .[3] ప్రపంచవ్యాప్తంగా కనీసం 5 మిలియన్ల మంది ప్రజలు ఈ వ్యాధికి ప్రభావితమయ్యారు.[5] ఈ వ్యాధిగ్రస్తుల ఆయుఃప్రమాణం సాధారణంగా ఐదు సంవత్సరాల లోపే ఉంటుంది .[3]
సూచనలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "Pulmonary Fibrosis". medlineplus.gov. Archived from the original on 5 July 2016. Retrieved 20 December 2019.
- ↑ "Pulmonary fibrosis - Symptoms and causes". Mayo Clinic (in ఇంగ్లీష్). Archived from the original on 15 July 2014. Retrieved 20 December 2019.
- ↑ 3.0 3.1 3.2 "Pulmonary Fibrosis". MedicineNet, Inc. Archived from the original on 19 July 2014. Retrieved 26 July 2014.
- ↑ 4.0 4.1 "Pulmonary fibrosis - Diagnosis and treatment - Mayo Clinic". www.mayoclinic.org. Archived from the original on 4 July 2014. Retrieved 20 December 2019.
- ↑ "American Thoracic Society - General Information about Pulmonary Fibrosis". www.thoracic.org. Archived from the original on 20 December 2019. Retrieved 20 December 2019.