ring
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ఉంగరము.
- a circle మండలము, వలయము.
- the wedding ring పెండ్లి కూతురి యెడమ చేతి వుంగరపు వేలిలో వేశే వుంగరము.
- a plain finger ring బటువు.
- a toe ring చుట్టు, మెట్టె.
- a nose ring ముంగర, నత్తు, ముక్కు పోగు.
- the ring of grass to set a pot upon చుట్టకుదురు.
- a wasp has rings of yellow round its body గండ్రీగ మీద పచ్చసుళ్లు వుంటవి.
- a ring or circle of people గుండ్రము గా నిలిచిన వాండ్లు, వలయాకారముగా నిలిచినవాండ్లు.
- the ring or boxing ring జెట్టీల సమూహము.
- the ring of baked earth in a well వొరలు, a ring well వొరలబావి.
- black rings worn as bracelets నల్ల గాజులు.
- a staple ring గొలుసు కొండి.
- a ring or peal of bellls సప్త స్వరములు పలికే గంట ల జత.
- I heard a ring గంటల యొక్క నాదము విన్నాను.
- a road that sound round చుట్టూ రు వుండే దోవ.
- the sound of a bell నాదము, ధ్వని.
- the ring finger అనామిక అనే వేలు.
- rings of hair on a horse skin సుళ్ళు.
క్రియ, విశేషణం, వాయించుట, గంట వాయించుట.
- he rung the bell గంటవాయించినాడు.
- he rang for a servant పనివాడు రావలసినదని గంట వాయించినాడు.
- they rang it in his ears that he has suffered injustice అన్యాయమును పొందినానని వాని చెవిలో యిల్లు కట్టుకొని చెప్పినారు.
- what is the good of your ringing that in my ears ఆ మాటను నాతో పదేపదే యెందుకు చెప్పుతావు.
క్రియ, నామవాచకం, వాగుట, మోగుట, శబ్దించుట, ధ్వనించుట.
- the whole town rings with this news యీ సమాచారము వూరంతా భోరు గొలుగుతున్నది.
- they laughed till the room rang again యిల్లంతా యెగిశిపొయ్యేటట్టు నవ్వినారు.
- the bell is ringing for church పూజ గంట వాగుతున్నది.
- I hear the bell but it is not ringing for church గంట వింటున్నదిగాని అది పూజ గంట కాదు.
- while their cries were still ringing in our ears వాండ్ల కూతలు అప్పటికి మాకు వూరికె వింటూ వుండగా.
- my ears rang with astonishment దాన్ని విని నా చెవులు అడుచుకొని పోయినవి, నేను విని ఆశ్చర్యపడ్డది యింతంత కాదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).