[go: up one dir, main page]

Jump to content

pass

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, పోవుట, వెళ్లుట, గడుచుట, జరుగుట, దాటుట, చెల్లుట.

  • as I was passing by this road నేను యీ దోవను పోతూ వుండగా before one week pass ed వొకవారము కాకమునుపే.
  • much money passes through his hands వాడి చేతి గుండాబహురూకలు ప్రయమౌతున్నవి.
  • this money passes there యీ రూకలు అక్కడచెల్లుతున్నవి.
  • this story will not pass యీ కథకు పనిరాదు.
  • he passed for her sonదాని కొడుకు అనిపించుకున్నాడు.
  • he passes for a learned manపండితుడనిపించుకొంటాడు.
  • do you know what passed between the parties ?వారికీ వీరికీ యేమి జరిగినదో నీకు తెలుసునా.
  • he let the opportunity pass సమయాన్నివిడిచిపెట్టినాడు.
  • let it pass కాని చింతలేదు.
  • the fever pass ed away జ్వరమువిడిచిపోయినది.
  • when youth passed away యౌవనము తీరేటప్పటికి గడిచేటప్పటికిafter the law passed చట్టము పుట్టిన తరువాత.
  • God brought this to pass దేవుడుదీన్ని జరిపించినాడు.
  • it came to pass that he broke his arm వాడి చెయ్యి విరిగేటట్టుసంభవించినది, ఘటించినది.
  • his words came to pass వాడు చెప్పినట్టే ఆయెను.
  • he passed over the field ఆ పొలము దాటినాడు the army pass ed over the river ఆ దండుయేరు దాటినది.
  • the water passes through the cloth గుడ్డలో నీళ్ళు దిగుతున్నది.
  • they pass es close under wall ఆ గోడ వోరగా పోయినారు.
  • hey pass హూ మంత్రక్కాళిమాయక్కాళి.

క్రియ, విశేషణం, దాటుట, సంభవించుట.

  • I passed ten days there అక్కడ పది దినాలుగడిపితిని.
  • he passed three nights without sleep నిద్రలేక మూడు రాత్రిళ్లు గడిపినాడు.
  • th army passed the river ఆ దండు యేరు దాటినది.
  • he passed the cord round the tree ఆ తాటిని చెట్టు చుట్టూ పోనిచ్చినాడు.
  • they passed the ball down the field aఆ గుండును అంచన మీద పొలమును దాటించిరి.
  • pass me that book ఆ పుస్తకాన్నినొకరిచేత నొకరు అందుకొని నాకు యియ్యండి.
  • he passed blood వాడికి నెత్తురు ప్రవర్తులుఅయినవి.
  • he passed blood in urine వానికి మూత్ర ద్వారములో నెత్తురుపడ్డది.
  • this passed all bounds యిది మట్టు మీరినపని.
  • they passed a law వొక చట్టము పుట్టించినారుచట్టము వొప్పుకొన్నాడు, మంజూరు చేసినాడు.
  • the bridge passed the river ఆ యేటికివారిధి వున్నది.
  • that road passes the river ఆ యేటికి వారిధి వున్నది.
  • that road passes my garden ఆ బాట మాయింటి వెంబడిగా పోతున్నది.
  • this story passes all belief యీ మాట నమ్మికను అతిక్రమిస్తున్నది, అనగా నమ్మకూడనిదిగా వున్నది.
  • the river passes this hill ఆ యేరు యీ కొండ ప్రక్కన పారుతున్నది.
  • after the runpassed the meridian మధ్యాహ్నమైన తరువాత.
  • he passed the river యేరుదాటినాడు.
  • when the cart passed his house రథము వాడింటిని దాటినప్పుడు.
  • hepass ed four hours in reading this దీన్ని చదువుతూ నాలుగు గడియలు కాలక్షేపముచేసినాడు.
  • he pass ed his examination పరిక్ష యిచ్చినాడు.
  • he passed by this story ఆకథను విడిచిపెట్టినాడు.
  • he passed by the fault తప్పును మన్నించినాడు.
  • he passed the poem off as being his యీ కావ్యము తాను చెప్పిన దనిపించినాడు.
  • he passed over this fact దీన్ని వుపేక్షగా విడిచిపెట్టినాడు, దాటవేసినాడు.
  • they passed a hot iron over his leg వాడికి కాలి మీద వాతవేసినారు.
  • he passed over this slightly దీన్నిజాడగా విడిచిపెట్టినాడు.
  • he passed the ruppee upon me as silver యిది వెండిరూపాయి అని నాకు తగలకట్టినాడు.
  • he passed the cord through the hole ఆబొందలో దారమును దూర్చినాడు.
  • he passed the thread through the eye of the needle సూదిలో దారమును గుచ్చినాడు.
  • I passed my word for him అతనికి పూటబడ్డాను, జామీను పడ్డాను.

నామవాచకం, s, a narrow entrance సందు.

  • between hills కనమ.
  • a permissionor pass port రహదారీ.
  • a pass for goods రవానా, రహదారీ.
  • he made a pass at me with his sword కత్తితో పొడవ వచ్చినాడు.
  • things came to this pass that he and his wife separated వాడు వాడి పెండ్లాము యెడబాసే గతి వచ్చినది.
  • matters have reached a fine pass వింతైన గతి వచ్చినది.

క్రియ, విశేషణం, (add,) gold does not lose any of its substance by passing through fire బంగారును పుఠము వేస్తేయెత్తు తగ్గదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pass&oldid=939922" నుండి వెలికితీశారు