home
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, ఉత్సత్తిస్థానమైన, స్వస్థానసంబంధమైన.
- home produce ఆ దేశములో వుత్పత్తిఅయ్యే సరుకులు.
- home price మొదటి వెల.
- I should be content if I got the home price నాకు మొదటి వెల వస్తే చాలును.
- home thrust చెడ్డ పోటు, మంచి పోటు,మంచి దెబ్బ.
- home truth మనస్సుకు తగిలే నీతి.
క్రియా విశేషణం, కడాకు, తీరా, బాగా.
- he drove the nail home ఆ మేకును తీరా కొట్టినాడు.
- he pushed it home దాన్ని తీరా తోసినాడు.
- he brought the charges home వాడి వ్యాజ్యమును పూర్తిగా రుజువు చేసినాడు.
- the offence was brought home to him వాడి మిద నేరము పూర్తిగా రుజువైనది.
- his letter is very home to this point ఇందున గురించి అతి స్పష్టముగా వ్రాసినాడు.
- the morals inculcated in this book come home to every mans bosom ఈ గ్రంథములో వుండే నీతులు అందరి మనస్సుకున్ను బాగా తగులుతున్నవి.
- home bred ఇంట్లోనే పెరిగిన వొకటీ తెలియని ప్రపంచము యెట్టిదో యెరగని, బేలయైన.
- home felt మనసుకు తగిలిన, మనసులో నాటిన.
- home made ఇంట్లో చేసిన.
నామవాచకం, s, ఇల్లు, స్వస్థానము, స్వగృహము, యథాస్థలము, ఎప్పటి చోటు.
- I will give him a home వాడికి దిగడానకు చోటిస్తాను.
- he found ahome under the tree ఆ చెట్టుకింద దిగినాడు.
- he has neither house nor home వాడికి యిల్లు లేదు వాకిలి లేదు.
- you may go home నీవు యింటికి పోవచ్చును.
- he is gone ఇంటికి పోయినాడు, ఊరికి పోయినాడు, దేశానికి వెళ్ళినాడు.
- or country స్వదేశము.
- we have lately had no news from home ఇటీవల దేశములలో నుంచి సమాచారము రాలేదు.
- he is always at home వాడు యేవేళా ఇంట్లోనే వుంటాడు.
- he did not feel at home with them వాండ్లకూ వీడికి పొసగలేదు.
- I felt at home with them వాండ్లకు నాకు చాలా అన్యోన్యముగా వుండినది.
- he is quite at home in Telugu వాడికి తెలుగు బాగా అభ్యాసమైనది.
- he is at home in that language వాడికి ఆ భాష కరతలామలకము.
- the fish is not more at home in waterthan you are in squabbling చేపలకు నీళ్ళు యెట్లాగో అట్లా నీకు కలహమేకల్యాణము.
- charity begins at home స్వయంతీర్థఃపరాన్ తారయతి, తన్ను మాలిన ధర్మముకద్దా.
- this is a home remark ఇది మనస్సును తగిలే దృష్టాంతము.
- why do you blame them ? you should look at home ! వొకరిని యేల అంటావు నీ గతి యెట్టిదో చూడు.
- he is gone to his long home చచ్చినాడు.
- home sick స్వదేశభ్రాంతిగల.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).