fail
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, తప్పిపోవడము, నిష్ఫలముకావడము.
- without fail తప్పకుండా.
క్రియ, విశేషణం, తప్పుట.
- do not fail me నాకు తప్పక.
- God willnot fail those who trust in him తన్ను నమ్మినవాండ్లను దేవుడు చెయ్యి విడువడు.
- he failed me నన్ను వుపేక్షించినాడు, నన్ను చెయ్యి విడిచినాడు.
- my strengthfailed me నాకు దార్ఢ్యము తప్పినది.
- on receiving the blow on my headmy eyes failed me తల మీద దెబ్బ తగలగానే నా కండ్లు తిరిగినవి.
- my legsfailed me and I fell నాకు కాళ్లు నిలవక పడ్డాను.
- when we had been amonth at sea our water failed us నెల దినములు నీళ్లమీద వుండేటప్పటికిమాకు మంచినీళ్లు అయిపోయినది.
క్రియ, నామవాచకం, తప్పుట, వోడిపోవుట, భంగపడుట.
- he failed to comeరాకపోయినాడు, రాక తప్పినాడు.
- thou didst fail to come రావైతివి.
- it failed or was fruitless అది తప్పిపోయినది, అది నిష్ఫలమైపోయినది .
- I failed to become his wife అతడికి పెండ్లాము కానైతిని.
- his patience failed వాడి ప్రాణము విసికినది.
- before he had paid half the account the money failed ఆ లెక్క సగము మట్టుకు చెల్లించేటప్పటికే ఆ రూకలు అయిపోయినవి.
- his strength failed వాడి బలము పోయినది.
- his sight is failing వాడి దృష్టి మట్టుబడుతున్నది.
- the family failed in the fourth generation ఆ వంశము నాలుగు తరాలతో నిలిచిపోయినది.
- the merchantfailed ఆ వర్తకుడు దివాలెత్తినాడు.
- fail not to send him వాన్ని పంపించక పొయ్యేవు సుమీ, తప్పకుండా వాణ్ని పంపు.
- they will not fail to come రాకుండా మానరు, తప్పకుండా వత్తురు, అవశ్యముగా వత్తురు.
- he failed in his law promise ఆడినమాట తప్పినాడు.
- he failed in his law suit వాడు వోడినాడు.
- should you fail of effecting this నీవు నెరవేర్చక తప్పితివేని.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).