[go: up one dir, main page]

Jump to content

look

విక్షనరీ నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, దృష్టి చూపు.

  • he gave me a look వానికన్ను, లేక, దృష్టి నామీద పారినది.
  • or appearance ముఖవిలాసము, ముఖము.
  • at the first look I thought so మొదట చూడగా అఅట్లా తోచినది.
  • his looks shewed that he was offended వాడి ముఖము చూస్తే కోపముగా వున్నట్టువున్నది.
  • she has a cheerful or pleasant look అది వుల్లాసముగా వున్నది.
  • good looks సౌందర్యము, ఇది నీచమాట.
  • this Hindu has the look of a Musulman వీడి ముఖము చూస్తే తురకవాడివలె వున్నది.
  • we are on the look our for him అతనికి యెదురు చూస్తున్నాము.
  • I am on the look out for a house ఒక యిల్లు కావలెనని విచారిస్తాను.
  • a look out house ఠాణా, చౌకి.
  • looking after (care, supervision) విచారణ, the best of servants want looking after సేవకులు యెంత మంచివాండ్లయినా వాండ్లనున్ను వొకకంట కనిపెట్టవలసినది.

క్రియ, నామవాచకం, చూచుట.

  • how can you see it you wont look చూడకుంటే నీ కెట్లాతెలుసును.
  • when I looked I saw him do this నేను చూచేటప్పటికి వాడు దాన్ని చేసేదితెలిసినది.
  • I looked ag in but I did not see him నేను మళ్లీ చూచేటప్పటికి వాడు కానము.
  • look at it దాన్ని చూడు.
  • I looked at the letter but I did not see the meaningఆ జాబు చూచినానుగాని అర్థముకాలేదు.
  • I looked but it was too dark to see any thingనేను చూచినాను అయితేనిండా చీకటి అయినందువల్ల వొకటీ అగుపడలేదు.
  • I looked for the word in the dictionary ఆ మాటను నిఘంటులో వెతికినాను.
  • I looked out a horse for him అతనికై వొక గుర్రమును విచారించినాను.
  • he looksup to you as a master నిన్ను యజమానుణ్నిగా విచారిస్తాడు.
  • they look down upon him వాణ్ని వుపేక్ష చేస్తారు.
  • he looks after my horses నా గుర్రాలను అతడు విచారించుకొంటాడు, పరామర్శించుకొంటాడు.
  • అతని కాపుదారిలో వున్నవి.
  • I look upon this as the truth ఇది నిజమని తోస్తున్నది.
  • they look upon him as a thief వాణ్ని దొంగ అని అంటారు.
  • I looked over this letter ఆ జాబును పార చూచినాను.
  • you must look to this నీవు దీన్ని చూచుకోవలసినది,విచారించుకో వలసినది.
  • they looked to God for aid దేవుడే దిక్కు అనుకొన్నాను.
  • If your son takes this I shall look to you for payment దీన్ని నీకొడుకు తీసుకుపోతే రూకలు చెల్లించేటందుకు నీవు వున్నావనుకొన్నాను.
  • do not look to me for money రూకలతోటి మాట నాది కాదు.
  • this is the point to look to ముఖ్యముగా విచారించవలసిన విషయము యిదే.
  • They may forward to having a nily వాండ్లకు బిడ్డలు కలగవచ్చును.
  • you must look about you నీవు పదిలముగా వుండవలసినది, అజాగ్రతగా వుండరాదు.
  • to look after విచారించుట.
  • I looked hard at him వాణ్ని నిదానించి చూస్తిని.
  • when we look back to childhood బాల్యదశను తలచుకొంటే.
  • why dont you look before you ముందు రాబొయ్యేదాన్ని యేల విచారించవు.
  • he looks very big వాడు మహా గర్విష్ఠుడుగా అగుపడుతాడు.
  • we long looked for his arrival అతని రాకకు బహుదినాలు యెదురు చూస్తిమి.
  • he looked into the wellబావిలో తొంగిచూచినాడు.
  • I looked into the accounts ఆ లెక్కలను పరిశోధించినాను.
  • will you look in tomorrow ? రేపు మా యింటికి వస్తావా.
  • he is much looked up to in this town ఈ వూరిలో వాడు నిండా గౌరవము పొందివున్నాడు.
  • To look or seem తోచుట, అగుపడుట.
  • It looked like a snake ఇది పామువలె వుండినది.
  • he looks well to-day నేడు వాడి యొక్క ముఖము తేటగా వున్నది.
  • his doing this looks well వాడు దీన్ని చేయడము మంచిదనితోస్తున్నది, అగుపడుతున్నది.
  • he looks like a fool పిచ్చివాడివలె వున్నాడు.
  • she looks ill దానికి వౌళ్లు కుదురులేనట్టు తోస్తున్నది.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=look&oldid=937031" నుండి వెలికితీశారు