[go: up one dir, main page]

Jump to content

at

విక్షనరీ నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.

బ్రౌను నిఘంటువు నుండి[1]

విభక్తి ప్రత్యయం, లోకి, వద్ద, అందు.

  • what is he at వాడు యేమి చేస్తాడు.
  • he was then atthe gate గడప దగ్గెర వుండినాడు.
  • he entered at the window కిటికీ గుండా దూరెను.
  • he threw a stone at me నా మీద రాయి వేసినాడు.
  • he frowned at me నన్ను ఉరిమిచూచినాడు.
  • she laughed at me నన్ను చూచి నవ్వినది.
  • he fired at the mark but did not hit it గురి చూచి కాల్చినాడు గాని తగులలేదు.
  • at the well బావి దగ్గెర.
  • the dog barked at him ఆ కుక్క వాణ్ని చూచి మొరిగింది.
  • the cow ran at him ఆ యావువాణ్ని కుమ్మపోయినది.
  • at these words he rose యీ మాటలు విని లేచినాడు.
  • at how much a yard do they sell this cloth యీ గుడ్డ గెజ మెట్లా అమ్ముతారు.
  • at ten oclock పది ఘంటలకు.
  • at this యిందుకు.
  • he was disgusted at this యిందుకు.
  • he was disgusted at this యిందుకు అసహించినాడు.
  • grieving at her absenceఅది లేనందుకు వ్యాకులపడి.
  • he was surprised at it అందున గురించి ఆశ్చర్యపడ్డాడు.
  • he was frightened at this యిందుకు భయపడ్డాడు.
  • I was at this expense for you నీ నిమిత్యమై యీ వ్రయము పడ్డాను.
  • he was angry at this యిందున గురించికోపగించుకొన్నాడు.
  • at all యెంత మాత్రము.
  • not at all యెంత మాత్రము లేదు.
  • thereis no body at all యేవరూ లేరు.
  • there is nothing at all ఒకటీ లేదు.
  • he did notweep at all వాడు యేడవనే లేదు, వాడు బొత్తిగా యేడవ లేదు.
  • at the bottomఅడుగున.
  • a child at the breast చంటిబిడ్డ.
  • at dawn ఉదయాన.
  • I came here at hisdesire అతని ఉత్తరువు మీద యిక్కడికి వచ్చినాను.
  • at a distance దూరాన.
  • heknocked at the door తలుపును తట్టినాడు.
  • he lives at ease సుఖముగా వున్నాడు,క్షేమముగా వున్నాడు.
  • at the end తుదను, తుదకు.
  • at every word మాటమాటకు.
  • at agreat expens, బహు వ్యయము దగ్గెర.
  • I has no servants at hand నా దగ్గెరపనివాండ్లు వుండలేదు.
  • If you have that book at hand ఆ పుస్తకము నీ వద్ద వుంటే.
  • I received it at his hands అతని చేతిగుండా తీసుకొంటిని.
  • when summer is athand యెండకాలము తటస్థమయ్యేటప్పటికి.
  • I was then at home యింట్లో వుంటిని.
  • atlast తుదకు, కడాపట.
  • at least మెట్టుకు, అధమం, కడకు, యెంత తక్కువైనా.
  • If they dont come I at least will come వాండ్లు రాకుంటే నేనైనా వస్తాను.
  • Not being at leisure to go there అక్కడికి పోతీరక.
  • at length తుదకు, కడాపట.
  • Look at this దీన్ని చూడు.
  • I was at a loss what to do నాకు ఒకటీ తోచక వుంటిని.
  • at most నిండా వుంటే.
  • the child is at most five years old ఆ బిడ్డకు నిండా వుంటేఅయిదేండ్లువుండును.
  • at night రాత్రిలో.
  • so late at night యింత రాత్రిలో, రాత్రి యింతపొద్దుపోయి.
  • at no time was hethere వాడు అక్కడ ఒకనాడూ వుండలేదు.
  • at noonమధ్యాహ్నమందు.
  • at once ఒక దెబ్బన.
  • all at once అంతా ఒకే దెబ్బన, అకస్మాత్తుగా,they are now at peace శాంతముగా వున్నారు, సమాధానముగా వున్నారు.
  • at pleasureయధేచ్ఛగా, ఇష్టము చొప్పున.
  • at present యిప్పట్లో.
  • at random అనియమముగా,వూరికె, మొత్తముగా, సగటున, they shot at random గురిలేక వూరికే కాల్చినారు.
  • aword spoken at random మొత్తముగా చెప్పిన ఒక మాట.
  • at the rate of tenrupees పది రూపాయలు చొప్పున.
  • at the present rate యిప్పటి వెలకు.
  • at any rateమెట్టుకు యెట్లాగైనా, యే విధాననైనా.
  • If you cannot do all the work today atany rate do half of it.
  • నేటిలోగా ఆ పని అంతా చేయకుంటే మెట్టుకు సగమైనాచెయ్యి.
  • you must go there at any rate నీవు యే విధాననైనా అక్కడికి పోవలెను.
  • theship is at sea ఆ వాడ సముద్రములో వున్నది.
  • he lay at my side నా పక్కనపండుకొన్నాడు.
  • at sight చూచిన క్షణము.
  • at full speed అతి త్వరగా.
  • the work is ata stand పని నిలిచి వున్నది.
  • I was at a stand యెటూ తోచక వుంటినిని.
  • at the timehe arrived వాడు వచ్చి చేరినప్పుడు.
  • ten at a time తడవకు పదేసి.
  • at that timeఅప్పుడు, అప్పట్లో, ఆ కాలమందు.
  • at one time ఒకప్పుడు.
  • at times అప్పటప్పటికి, ఒకఒక వేళ.
  • they are at variance వాండ్లు ద్వేషముగా వున్నారు.
  • they are at warయుద్ధము చేస్తున్నారు, కలహపడుతున్నారు.
  • he was at his wits end for a dinnerకూటికి యెట్లా అని మిణకరిస్తున్నాడు.
  • he isnow at work పని మీద వున్నాడు.
  • at theworst or at the best మెట్టుకు.
  • at my saying this నేను యిట్లా చెప్పినందున.
  • at hisconsenting అతని సమ్మతి మీద.
  • at going out I met him బయట పోతూ వుండగావాడు నాకు యెదురుపడ్డాడు.
  • at him, again ! మళ్ళీ వాడి మీద యుద్ధములో వుసుకొలిపేమాట.
  • æt అను పురాతనాంగ్ల పదం నుండి మన ఎట్ వచ్చినది, ఆ æt అనునది ad- అను ఇండో యూరోపియన్ ధాతు పదం నుండి వచ్చినది.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=at&oldid=923861" నుండి వెలికితీశారు